ETV Bharat / city

పారిశుద్ధ్య సిబ్బంది నియామకంలో కుమ్మక్కు

విజయవాడ నగర పాలక సంస్థలో పారిశుద్ధ్యం సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు తలెత్తాయి. నగరంలో కరోనా వైరస్​ పెరుగుతున్నందున పారిశుద్ధ్య విధులను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అవుట్​సోర్సింగ్​ పద్ధతిన 3 నెలల కాలానికి సిబ్బందిని గుత్తేదార్లు సరఫరా చేయలేదు. ఈ పరిస్థిని తమకు అనుకూలంగా గుత్తేదార్లు, శానిటరీ ఇన్​స్పెక్టర్లు మార్చుకున్నట్లు ఫిర్యాదులు తలెత్తాయని కమిషనర్​కు, డిప్యూటి మెడికల్​ అధికారికి ఫిర్యాదులు వచ్చాయి.

complaints raised against fraud happened in contract sanitary workers allotment
పారిశుద్ధ్య సిబ్బంది నియామకాల్లో అవకతవకలు
author img

By

Published : Apr 27, 2020, 8:27 AM IST

అధికారులకు ఫిర్యాదులు

విజయవాడలో కోవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపర్చేందుకు 3 నెలల కాలానికి అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిన సిబ్బందిని విధుల్లోకి తీసుకునే ప్రక్రియలో అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేలు చెల్లించేలా మొత్తం 533 మంది అవసరం అంటూ ఇటీవల టెండర్లు ఆహ్వానించారు. కొంతమంది గుత్తేదారులు ముందుకు రాగా వారిని ఎంపిక చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి 7 రోజుల్లోగా సిబ్బందిని సరఫరా చేసి అగ్రిమెంట్లు చేసుకోవాల్సి ఉంది. నెలాఖరవుతున్నా ఇప్పటి వరకు గుత్తేదార్లు మాత్రం పూర్తిస్థాయిలో సిబ్బందిని సరఫరా చేయలేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి అధికం అవుతుండడం వల్ల ఎవరూ పారిశుద్ధ్య విధులు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఈ స్థితిలో గుత్తేదార్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కుమ్మక్కై పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. లేని సిబ్బంది ఉన్నట్లు, రానివారు వచ్చినట్లు, సరఫరా చేయకుండానే చేసినట్లుగా దొంగలెక్కలు వేస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై కార్మిక యూనియన్లు సైతం అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. రూ.లక్షల ప్రజాధనం చేజారిపోయే పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు.

విషయం కమిషనర్‌ దృష్టికి వచ్చింది
సిబ్బంది సరఫరా విషయంలో ప్రస్తుత అక్రమాలపై కమిషనర్‌కు, తనకు ఫిర్యాదులు వచ్చాయని డిప్యూటి మెడికల్​ అధికారి వెంకట రమణ అన్నారు. ఈ విషయంలో కమిషనర్‌ తనతో మాట్లాడినట్లు తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. యూనియన్‌ నాయకులు కూడా ఫిర్యాదు చేశారు. సిబ్బంది వాస్తవిక లెక్కలు తేలుస్తున్నాం. వారి ఆధార్‌కార్డు, పాన్‌కార్డు పంపమని చెప్పాం. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. సరఫరా చేసిన సిబ్బందితో గుత్తేదార్లు పెరేడ్‌ నిర్వహించాలని ఆదేశించానని చెప్పారు.

complaints raised against fraud happened in contract sanitary workers allotment
పారిశుద్ధ్య సిబ్బంది నియామకాల్లో అవకతవకలు

ఇదీ చదవండి :

స్థానికుల ఫిర్యాదు... అధికారులపై మంత్రి ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.