విజయవాడలో ఆన్లైన్ రుణ సంస్థల బాధితుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేని వారిని యాప్ నిర్వాహకులు వేధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరహాలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 20 ఫిర్యాదులు వచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
బాధితులు ఒక్కొక్కరు 50 వేల నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు రుణాలు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. పెనమలూరు, భవానీపురం, కృష్ణలంక, సత్యనారాయణపురం, పటమట ప్రాంతాలకు చెందిన కొంతమంది బాధితులు ఈ వేధింపుల విషయమై ఫిర్యాదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 52 మైక్రో ఫైనాన్స్ యాప్లను గుర్తించినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
కెరీర్ చివరిలో ఇలాంటి పిటిషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది: జస్టిస్ రాకేష్ కుమార్