ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)పై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. సచివాలయంలో ఇవాళ భేటీ అయిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్.. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ వివిధ ఉగ్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై.. సీపీఎస్ అంశంపై చర్చించనుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి తుది నివేదికను అందించనుంది. ఈ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ ఉన్నారు.
ఇదీ చదవండి: సీఎస్ నేతృత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం.. సీపీఎస్ రద్దుపై చర్చ