నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించి ప్రాజెక్టులు కట్టలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నీటి విషయంలో తనకు అవగాహన ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. నీటి విషయంలో బేసిన్లు, భేషజాలు లేవని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే నదీ జలాలను వాడుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు.
వేటిని లేవనెత్తాలో కూడా
పోతిరెడ్డిపాడు మీద భయంకరంగా పోరాడింది ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతిపక్షాలకు విషయాలు వేటిని లేవనెత్తాలో కూడా తెలియట్లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో సీఎంలకు చెంచాగిరి చేసిందెవరో తెలియదా అని అన్నారు. చట్ట పరిధిలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తామన్నారు.
ఏం సాధించారు
చంద్రబాబు మాట్లాడితే బస్తీమే సవాల్ అన్నారు.. ఏం సాధించారని ప్రశ్నించారు. మహారాష్ట్ర మీదకు బాబ్లీ అని చంద్రబాబు పంచాయితీ పెట్టారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రతో సత్సంబంధాలతో నీళ్లు సాధించానన్నారు. రాయలసీమకు నీళ్లు అవసరమైతే గోదావరి నుంచి తీసుకుని వెళ్లమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. మిగులు జలాలు ఉన్న గోదావరి నీళ్లు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : తెలంగాణలో మే 31 వరకు లాక్డౌన్