రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ఆశ్రమంలో త్రిదండి శ్రీరామనుజ చినజీయర్ స్వామి(Tridandi Sri Ramanuja Chinjiyar Swamy)ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM kcr) కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి చినజీయర్‌స్వామిని కలిశారు. యాదాద్రి ఆలయ (yadadri temple) పునఃప్రారంభంపై చినజీయర్ స్వామితో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.
ఇటీవల యాదాద్రి పున:ప్రారంభంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో క్లారిటీనిచ్చారు. నవంబరు, డిసెంబరులో యాదాద్రి పునఃప్రారంభిస్తామని కేసీఆర్ (cm kcr in assembly sessions 2021) తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తెలిపారు. భారీ సుదర్శనయాగం చేసి యాదాద్రి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే చినజీయర్ స్వామిని కేసీఆర్ కలిసినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: GRMB meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం