ETV Bharat / city

CM Jagan: గ్రామ సచివాలయాలకు వెళ్లకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయి?: సీఎం

author img

By

Published : Jul 27, 2021, 4:21 PM IST

Updated : Jul 28, 2021, 4:18 AM IST

కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సరిగా పర్యటనలకు వెళ్లని వారికి మెమోలు జారీచేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.

CM Jagan
CM Jagan

గ్రామ, వార్డు సచివాలయాల పర్యటనలకు వెళ్లని అధికారులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి వారికి మెమోలు ఇవ్వాలని తన కార్యాలయ (సీఎంఓ) అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 1,098 చోట్ల తనిఖీలు చేయాలని చెబితే.. 733 చోట్లకు మాత్రమే వెళ్లారని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. ‘క్షేత్రస్థాయికి వెళ్లకపోతే పింఛన్‌ సమయానికి అందుతుందా? రేషన్‌ కార్డు ఇస్తున్నారా? అర్హులందరికీ నగదు బదిలీ పథకాలు అందుతున్నాయా? అనే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి?’ అని ప్రశ్నించారు. ‘స్పందన’పై మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ‘గ్రామ/వార్డు సచివాలయ పర్యటనల్లో కలెక్టర్లు 106%, సంయుక్త కలెక్టర్లు (గ్రామ/వార్డు సచివాలయాలు) 107% లక్ష్యాన్ని సాధించారు. జేసీ (ఏ అండ్‌ డబ్ల్యు) 85%, జేసీ(రెవెన్యూ) 78%, జేసీ (హౌసింగ్‌) 49%, పురపాలక కమిషనర్లు 89%, ఐటీడీఏ పీవోలు 18% తనిఖీలు మాత్రమే చేశారు. వీరి పని తీరు బాగాలేదు. ఇది అంగీకారయోగ్యం కాదు. క్షేత్రస్థాయి తనిఖీల ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకున్నట్లు కనిపించడం లేదు. వీరందరికీ మెమోలు వస్తాయి.

ఇది నాకు బాధ కలిగించేదే. మీకు మెమోలు ఇవ్వడం అంటే నా పనితీరు మీద నేను ఇచ్చుకున్నట్లే. వచ్చే ‘స్పందన’ సమీక్ష నాటికి 100 శాతం పర్యటనలు జరగాలని’ సీఎం స్పష్టం చేశారు. ‘సచివాలయాల్లో సిబ్బంది హాజరుపై దృష్టి పెట్టండి. మీరు తనిఖీలకు వెళ్తుంటేనే.. నిర్దేశిత సమయం వరకు వారూ అందుబాటులో ఉంటారని’ పేర్కొన్నారు. ‘ధాన్యం బకాయిలు మొత్తాన్ని చెల్లిస్తున్నాం. రూ.3,300 కోట్లకు గాను రూ.1,800 కోట్లు పది రోజుల కిందటే ఇచ్చాం. మిగిలిన బకాయిలు విడుదల చేశాం. పంట ఉత్పత్తుల సేకరణ తర్వాత 21 రోజుల్లోపు కచ్చితంగా డబ్బు అందించగలిగితేనే రైతుకు మంచి జరుగుతుందని’ సీఎం పేర్కొన్నారు.

  • శ్రీశైలంలో 796 అడుగుల డెడ్‌స్టోరేజి నుంచే విద్యుత్తు ఉత్పత్తి చేసే పరిస్థితి మన కళ్లముందే కనిపించింది. దేవుడి దయతో శ్రీశైలం నిండుతోంది, రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల్లో వర్షాలతోనే జలాశయాలకు నీరు చేరుతోంది.
  • ఖరీఫ్‌ విస్తీర్ణం పెరుగుతోంది. ప్రతి ఆర్‌బీకే పరిధిలో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు కనీసం 10%, జేడీఏ, డీడీఏలు 20%, వ్యవసాయ, ఉద్యాన అధికారులు 30% చొప్పున ఈ-క్రాప్‌ను తనిఖీ చేయాలి. రైతులకు డిజిటల్‌, పత్ర రశీదు ఇవ్వాలి. భూమి ఎవరిది? పత్రాలు ఉన్నాయా? ఇవ్వకపోతే ఈ-క్రాప్‌ చేయమనే ప్రశ్నలు రాకూడదు. రైతు భరోసా కేంద్రంలోనే బ్యాంకు సేవలు అందాలి.
  • నెలలో మొదటి శుక్రవారం ఆర్‌బీకే, రెండో శుక్రవారం మండల, మూడో శుక్రవారం జిల్లా స్థాయిల్లో వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు జరగాలి. గ్రామ/మండలస్థాయి నుంచి వచ్చే సలహాలన్నీ స్వీకరించి.. జిల్లా సమావేశంలో చర్చించి పరిష్కారాలు చూపాలి. కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలి. అధిక సంఖ్యలో తనిఖీలు నిర్వహిస్తేనే కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్ని నివారించగలుగుతాం.నిరంతరం దాడులు నిర్వహించాలి.
  • ఇళ్ల నిర్మాణం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. సిమెంటు, స్టీలు, ఇటుకలు తదితర సామగ్రి కొనుగోలు ఊపందుకుంటుంది. గృహ నిర్మాణంపై కలెక్టర్లు పర్యవేక్షించాలి. ఇసుక పంపిణీలో అవాంతరాలు లేకుండా చూడాలి. వచ్చే స్పందన లోగా.. టిడ్కో ఇళ్లకు సంబంధించి అనర్హుల స్థానంలో కొత్త లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలి.
  • కొవిడ్‌ ప్రభావం తగ్గుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.80% ఉంది. పరీక్షలు కొనసాగించాలి. అనుమానంతో ఎవరైనా అడిగితే వెంటనే పరీక్ష చేయాలి. అన్నీ కూడా ఆర్‌టీపీసీఆర్‌ మాత్రమే చేయండి. కేంద్రం కేటాయించిన మేరకు మాత్రమే టీకాలు వేయగలుగుతాం. మూడోదశపై అప్రమత్తంగా ఉండాలి. ఆగస్టు చివరి నాటికి.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.
  • ఆగస్టు 15 నుంచి 31 వరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని లక్ష్యం. మొక్కలు నాటడంతో పాటు వాటికి నీరు పోయడం, పరిరక్షించడంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సర్పంచిలను భాగస్వామ్యం చేయాలి.
  • ఆగస్టు 10న నేతన్న నేస్తం, 16న విద్యా కానుక, 24న అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం, 27న ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌ మిల్లులకు ప్రోత్సాహకాలు ఇస్తాం.

ఇదీ చదవండి

దిశ బిల్లుపై ఏపీ నుంచి తిరిగి స్పందన రాలేదు: కేంద్ర హోంశాఖ

Last Updated : Jul 28, 2021, 4:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.