ఏపీ అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టు కింద పాల సేకరణను సీఎం జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో జగన్‌తోపాటు పలువురు మంత్రులు, అమూల్ ఎండీ సోధి, పాడి రైతులు పాల్గొన్నారు.
డిసెంబర్ నుంచి ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లోని 400 గ్రామాల నుంచి అమూల్ సంస్థ ద్వారా 41 లక్షల 44 వేల లీటర్ల పాల సేకరణ జరిగిందని..సీఎం జగన్ చెప్పారు. అమూల్ ప్రైవేటు సంస్థ కాదన్నారు. సంస్థలో వచ్చిన లాభాలను..తిరిగి పాల ఉత్పత్తిదారులకే చెల్లిస్తారని జగన్ స్పష్టం చేశారు.
ఇదీచదవండి
ప్రధానికి సీఎం జగన్ లేఖ.. 60 లక్షల కరోనా వ్యాక్సిన్లు పంపాలని విజ్ఞప్తి