కొవిడ్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. కరోనా రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతంగా ఉందని చెప్పారు. గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా అప్రమత్తంగా మహమ్మారి పట్ల అందరూ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో సిబ్బంది విషయమై 90 రోజుల్లో ఖరారు చేయాలని స్పష్టం చేశారు.
"వివాహ వేడుకల్లో 150కి మించి ఉండకుండా చూడాలి. విద్యా సంస్థల్లో పాటించాల్సిన ఎస్‌ఓపీలను విడుదల చేశాం. ఇంటింటికీ సర్వేలు కొనసాగాలి. కొవిడ్ లక్షణాలు ఉంటే పరీక్షలు చేయాలి. 104 అన్ని ఆరోగ్య అంశాల పరిష్కార మార్గంగా ఉండాలి. మూడో దశ వస్తుందో, లేదో తెలియకపోయినా సన్నద్ధంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అందుబాటులో పడకలు, ఆస్పత్రులను సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులోకి పీఎస్‌ఏ ప్లాంట్లు, 100 పడకలు దాటిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఇప్పటివరకూ 71,03,996 మందికి రెండు డోసులు, 1,18,53,028 మందికి ఒక డోస్ వ్యాక్సిన్ పూర్తి. 85 శాతం ప్రజలకు 2 డోసులు ఇచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సిన్లపై దృష్టి. సచివాలయం యూనిట్‌గా ప్రతి ఇంట్లో వ్యాక్సిన్లు పూర్తి చేయాలి. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి." - జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి.
కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని.. 15 రోజుల్లో ఈ చెల్లింపులపై దృష్టిపెడుతున్నట్లు సీఎం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన అర్జీలను తిరస్కరించారో చూడాలని అన్నారు.
"పథకాల దరఖాస్తుదారుల అర్హతను 21 రోజుల్లో నిర్ధరించాలి. పింఛన్, ఆరోగ్యశ్రీ, రైస్‌కార్డు దరఖాస్తుదారుల అర్హతను నిర్ధరించాలి. అర్హత సాధించిన వారికి 90 రోజుల్లో మంజూరు చేయాలి. సంవత్సరానికి నాలుగు సార్లు మంజూరు అవుతాయి. ప్రభుత్వం ప్రతి నెలా పథకాలను అమలు చేస్తోంది. సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమంపై అధికారులు పర్యవేక్షించాలి. హౌసింగ్ లేఅవుట్లలో ప్లాట్ల మ్యాపింగ్ 10 రోజుల్లో పూర్తి చేయాలి." - సీఎం జగన్
ఖరీఫ్ కింద ఇప్పటివరకు 59.07 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని సీఎం జగన్ వెల్లడించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు 10 శాతం ఇ–క్రాపింగ్ తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈలకు సెప్టెంబర్ 3న ప్రోత్సాహకాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి:
Jagan Bail cancel petition: జగన్ బెయిల్ రద్దు వ్యాజ్యంపై తీర్పు వాయిదా