ETV Bharat / city

ఉభయతారకంగా నదుల అనుసంధానం: సీఎం జగన్​

author img

By

Published : Mar 1, 2021, 4:48 PM IST

Updated : Mar 2, 2021, 6:04 AM IST

పోలవరం ప్రాజెక్టు కీలక పనులపై సీఎం జగన్‌ సమీక్ష చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. నదుల అనుసంధానంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

cm jagan review on polavaram project works

నదుల అనుసంధానంలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దీనిపై కేంద్రానికి పంపే ప్రతిపాదనలన్నీ ఉభయతారకంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సోమవారం అధికారులతో సమీక్షించారు. నదుల అనుసంధానంపై ఇటీవల దిల్లీలో జరిగిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ‘మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానంలో రాష్ట్ర, దేశ ప్రయోజనాలను కాపాడుకునేలా కేంద్రానికి నివేదికలు పంపాలి. ఇందులో అయోమయానికి, సందిగ్ధానికి తావు ఇవ్వొద్దు’ అని జగన్‌ సూచించారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై దిల్లీలో జరిగిన సమావేశం, దానికి సంబంధించిన వార్తలపైనా చర్చించారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు ఆస్కారం లేదు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఎత్తు తగ్గింపుపై ఇంకా చర్చలు, ప్రతిపాదనలు అసంబద్ధమంటూ సీడబ్ల్యూసీ, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖలు విస్పష్టంగా ప్రకటించాయి. ఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగినట్లుగా షట్టర్ల బిగింపు పూర్తవుతోంది’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

మే నెలాఖరుకల్లా కాఫర్‌ డ్యాం
కాఫర్‌ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్పిల్‌ ఛానల్‌, అప్రోచ్‌ ఛానల్‌ పనులను త్వరగా పూర్తి చేస్తే వరద నీటిని స్పిల్‌వే మీదుగా పంపే ఆస్కారం ఉంటుందని సూచించారు. ‘గత ప్రభుత్వ హయాంలో స్పిల్‌వే పూర్తి చేయకుండా.. కాఫర్‌ డ్యాం నిర్మించడంవల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాఫర్‌ డ్యాంనూ అక్కడక్కడ కట్టి వదిలిపెట్టారు. వరద నీరు సెకనుకు 13 మీటర్ల వేగంతో వచ్చినప్పుడు ప్రధాన డ్యాంవద్ద నది కోసుకుపోయింది. అందుకే వరదల సమయంలో స్పిల్‌ ఛానల్‌ పనులకూ ఇబ్బంది కలిగింది’ అని అధికారులు వివరించారు. గేట్లు, సిలిండర్ల బిగింపు పని చురుగ్గా సాగుతోందని, మే నెలాఖరు నాటికి కాఫర్‌ డ్యాం పనులూ పూర్తి చేస్తామని తెలిపారు.

వైఎస్సార్‌ విగ్రహం, ఉద్యానవనం
పోలవరం ప్రాజెక్టు వద్ద ‘జి’ కొండపై 100 అడుగుల ఎత్తులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం, వైఎస్సార్‌ గార్డెన్‌ నిర్మాణ ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. ‘కాలం గడిచే కొద్దీ అందం, ఆహ్లాదం పెరిగేలా, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండేలా ఈ గార్డెన్‌ ఉండాలి. పర్యావరణానికి ఇబ్బందులు కలగకుండా ఆకృతులు సిద్ధం చేయండి’ అని సీఎం సూచించారు. ప్రాజెక్టుకు దిగువన జి కొండను అనుసంధానించేలా వంతెన, వంతెనను కొండను కలిపేలా రోడ్డు నిర్మించాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు.

ఇదీ చదవండి: విమానాశ్రయంలో చంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు

Last Updated : Mar 2, 2021, 6:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.