ETV Bharat / city

వచ్చే విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం: సీఎం - నూతన విద్యావిధానంపై జగన్ సమీక్ష వార్తలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో జాతీయ నూతన విద్యా విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. 5 ప్లస్‌ 3 ప్లస్‌ 3 ప్లస్‌ 4 విధానం అమలుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు.

cm jagan review on new education policy
cm jagan review on new education policy
author img

By

Published : Sep 15, 2020, 7:44 PM IST

విద్యా రంగంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. ప్రమాణాలు పాటించని పక్షంలో పాఠశాలలు, కళాశాలలపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే మూసివేసి ఆయా ప్రమాణాలు సాధించిన తర్వాతే వాటి ప్రారంభానికి అనుమతి ఇవ్వాలన్నారు. విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్నియమించాలని సీఎం ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోన్న జాతీయ నూతన విద్యా విధానం-2020 అమలు చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్రతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జాతీయ నూతన విద్యావిధానంలో అంశాల వారీగా చర్చించారు.

వచ్చే ఏడాది నుంచే

వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అందుకు తగిన విధంగా పాఠ్య పుస్తకాల ముద్రించడంతో పాటు, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని నిర్దేశించారు. జాతీయ నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన 5 ప్లస్‌ 3 ప్లస్‌ 3 ప్లస్‌ 4 అమలు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు 1, 2 తరగతులకు ముందు మొదటి తరగతిలో సంసిద్ధతా తరగతిని అభ్యసిస్తే వారి పునాది దృఢంగా ఉంటుందన్న సీఎం.. ఆ మేరకు తగిన విధంగా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.

కనీస ప్రమాణాలు పాటించకపోతే..

గ్రామ, వార్డు సచివాలయాల సేవలను కూడా విద్యా రంగంలో వినియోగించుకునేందుకు అవసరమైన విధి, విధానాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విద్యాలయాలు, కళాశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అవి కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అనే విషయాన్ని ధ్రువపరచాలని ముఖ్యమంత్రి సూచించారు.

బదిలీలపై దృష్టి పెట్టాలి

వివిధ పాఠశాలలు, శిక్షణా సంస్దలు, కళాశాలలు ప్రమాణాలు పాటించాల్సిన ఆవశ్యకతపై తల్లిదండ్రులకు వివరించాలని, విద్యా సంస్థల్లో ప్రమాణాలు కొరవడితే నష్టపోయేది విద్యార్ధులేనని వారికి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్నియమించే విధంగా అవసరసమైన బదిలీలు చేయాలని సమావేశంలో సీఎం జగన్ ఆదేశించారు. జాతీయ నూతన విద్యా విధానంలో ఉన్న పలు అంశాలను ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన మధ్యాహ్నం, ద్విభాషా పాఠ్య పుస్తకాలు రూపొందించామన్నారు.

వారి కోసం డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టాలి

సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం, వీలైనంత వరకు స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా పాఠ్య పుస్తకాల రూపకల్పన, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఏడాదికి కనీసం 50 గంటల పాటు శిక్షణా కార్యక్రమాలు అమలు జరిగేలా చూడటం వంటివన్నీ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని అధికారులు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న వారిలో మరింత నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని జాతీయ నూతన విద్యా విధానంలో ప్రతిపాదించారని, అందుకు అనుగుణంగా ఎన్‌సీఈఆర్‌టీ కొన్ని మార్గదర్శకాలు రూపొందించిందని తెలిపారు. ఆ మేరకు అంగన్‌వాడీ కేంద్రాలలో పని చేస్తున్న వారిలో ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్న వారికి ఆరు నెలల డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సు, పదో తరగతి అర్హత ఉన్న వారికి ఏడాది డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టాల్సి ఉందని అధికారులు వివరించారు.

ఇదీ చదవండి:13 నెలల్లో స్వరాజ్ మైదానంలో పనులు పూర్తి చేయాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.