Global alliance for sustainable planet team with cm jagan: గ్లోబల్ అలియన్స్ ఫర్ సస్టయిన్‌బుల్ ప్లానెట్ సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్ చర్చలు జరిపారు. వ్యర్థాలనుంచి విలువైన వస్తువుల తయారీ ప్రాజెక్టును ప్రయోగత్మకంగా విశాఖలో చేపట్టాలని నిర్ణయించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో అనుసంధానమై ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా బీచ్‌లను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇతర అంశాలపైనా తగిన ప్రణాళికలు రూపొందించి నివేదించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, రీ సైక్లింగ్‌పై జీఏస్పీ ప్రతినిధి, ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్ సైరిల్ గట్చ్ సీఎంకు వివరాలు అందించారు. జీఏఎస్‌పీ అనుబంధ సంస్థ పార్లే ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలనుంచి తయారుచేస్తున్న విలువైన ఉత్పత్తులను ముఖ్యమంత్రికి వివరించారు.
ప్లాస్టిక్ వ్యర్ధాలను తిరిగి ఉపయోగపడేలా చేయడం చాలా మంచి పరిణామమన్న సీఎం ..ఏపీలో ఇప్పటికే ఇలాంటి వ్యర్ధాల సేకరణపై స్పష్టమైన విధానాన్న అనుసరిస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్ అలియన్స్ ఫర్ సస్టయిన్‌బుల్ ప్లానెట్ అనుబంధ సంస్థతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సహజసాగు విధానాలు కేవలం ప్రయోగశాలకే పరిమితం కాకుండా... వాటిని రైతులకు అందుబాటులో ఉండేలా చేయాలని సీఎం అన్నారు. సేంద్రియ సాగు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ చేపట్టాలని, వీటి ఫలితాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. సహజ సాగు ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలన్నారు. సహజసాగులో ఏపీ అంతర్జాతీయస్ధాయిలో నిలబడుతుందన్న సీఎం.. దీనికి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు. సహజసాగులో గ్రాడ్యుయేషన్ ప్రవేశపెట్టాలని సూచించామన్నారు.
ఇదీ చదవండి: 'అమరావతి ప్రగతికి సాయపడండి'.. కేంద్రానికి రైతుల విజ్ఞప్తి