CPS: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై (సీపీఎస్) ఉద్యోగ సంఘాలతో ఏప్రిల్ 4 నుంచి చర్చలు జరపాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. సీపీఎస్‌పై మంగళవారం సాయంత్రం సెక్రటేరియట్‌లోని ఒకటో బ్లాక్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.
సీపీఎస్‌కి సంబంధించిన వివరాలతో అధికారులు సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. సీపీఎస్‌పై నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉద్యోగ సంఘాలను భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, అధికారులు ఉద్యోగ సంఘాలకు వివరించి ఆ తర్వాత వారితో చర్చలు జరపాలని సీఎం అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: