ETV Bharat / city

Land Survey: జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలి: సీఎం జగన్

సమగ్ర భూ సర్వేపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. జూన్‌ 2023 నాటికి సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలన్నారు. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేలా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

cm jagan review on bhuraksha land survey
జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తికావాలి
author img

By

Published : Aug 12, 2021, 3:39 PM IST

Updated : Aug 12, 2021, 7:58 PM IST

2023 జూన్‌ నాటికి రాష్ట్రంలో భూముల రీసర్వే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రీసర్వేను..పకడ్బం‌ధీగా నిర్వహించాలని సూచించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలని సూచించారు. అవినీతిరహితంగా, ఆదర్శంగా సర్వే ప్రక్రియ ఉండాలన్నారు.

సర్వే చేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహా..రికార్డులు అప్‌డేట్‌ చేసి రైతులకు భూమికార్డులు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. త్వరగా సర్వే చేపట్టేందుకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాలన్నారు. సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని..అవసరమైతే నిపుణుల సేవలు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రాజెక్ట్‌ను అనుకున్న సమయానికి పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. దేశంలో సమగ్ర భూసర్వే పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని అధికారులు వివరించారు.

సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. సర్వేపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు. స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా దీనిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం తెలిపారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో కూడా సమగ్ర సర్వేపై సమీక్ష చేస్తానన్నారు.

సర్వే ఆఫ్‌ ఇండియాతో సమన్వయం చేసుకోవాలని, వారి సహకారాన్ని తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. సర్వే రాళ్లు కొరత లేకుండా చూడాలని,సకాలంలో వాటిని అప్పగించాలని భూగర్భ గనులశాఖ అధికారులకు ఆదేశించారు. నాలుగు ప్లాంట్లలో నవంబరు నుంచి సర్వే రాళ్లు ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. రోజుకు ఒక్కో ప్లాంట్లు నుంచి 4 వేలు చొప్పున రోజుకు 16 వేల సర్వేరాళ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ఇదీ చదవండి:

Telangana: కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ

Last Updated : Aug 12, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.