ముఖ్యమంత్రి జగన్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు..సీఎంకు ఘన స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సీఎం సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు మధ్య సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి..తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఏజీఆర్ షో ప్రారంభ కార్యక్రమం రద్దు
ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన ఏజీఆర్ షో ప్రారంభ కార్యక్రమాన్ని రద్దు చేశారు. దుర్గమ్మ చరిత్రను తెలిపేలా సాంకేతిక బోర్డులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభిచాల్సి ఉండగా..షో ప్రారంభ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి