రష్యా- ఉక్రెయిన్ పరిస్థితుల దృష్ట్యా.. పొద్దుతిరుగుడు నూనెకు కొరత ఏర్పడిందని అందుకు ప్రత్యామ్నాయంగా ఆవనూనె దిగుమతులపై.. సుంకాన్ని తగ్గించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు.. ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో సన్ ఫ్లవర్ వంటనూనెలకు కొరత ఏర్పడిందని ఈ ప్రభావం వినియోగదారులపై పడిందని లేఖలో సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ముడి ఆవనూనెపై 38.5శాతం, శుద్ధిచేసిన ఆవనూనెపై 45 శాతం దిగుమతి సుంకం ఉందని.. దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా ఉన్నాయన్నారు. వినియోగదారుల ఇబ్బందుల దృష్ట్యా కనీసం ఏడాది కాలంపాటు ఆవనూనెపై దిగుమతి సుంకాలను తగ్గించాలని సీఎం కోరారు.
ఇదీ చదవండి