కృష్ణా నది ముంపు నుంచి రక్షణకు విజయవాడలోని కృష్ణలంకలో తలపెట్టిన రిటైనింగ్ వాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాణిగారితోట వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించగా.. సీఎం రిమోట్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాణం జరిగే తీరు, ప్రజలకు కలిగే ఉపయోగం గురించి సీఎంకు అధికారులు వివరించారు. 125 కోట్ల రూపాయల ఖర్చుతో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్‌ను నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: వీడియో కాల్స్ కదా అని ఎత్తారో.. ఇక అంతే సంగతులు