ETV Bharat / city

cm jagan: ప్రతి పేదవాడు కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలనేదే లక్ష్యం: జగన్‌ - 14 వైద్యకళాశాలల వార్తలు

ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. అందులో భాగంగానే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యాశాల, దానికి అనుబంధంగా ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో వైఎస్సార్ క్లినిక్‌లు నెలకొల్పడం ద్వారా, కుటుంబవైద్యం అందించేందుకు కృషిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 14 వైద్యకళాశాల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు

cm jagan
రాష్ట్రంలో కొత్త వైద్యకళాశాలలు
author img

By

Published : May 31, 2021, 8:37 PM IST

14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన

రాష్ట్రంలో 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌... తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మొత్తం 16 మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటికే కడప జిల్లా పులివెందుల, విశాఖ జిల్లా పాడేరు కళాశాలల పనులు ప్రారంభించింది. మిగిలిన 14 కళాశాలల నిర్మాణానికి జగన్‌ శ్రీకారం చుట్టారు. విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పెనుకొండ, అదోని, నంద్యాలలో.. ఈ కళాశాలలు నిర్మించనున్నారు. దాదాపు 8 వేల కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో వీటిని నిర్మిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి వైద్య కళాశాలతో పాటు, నర్సింగ్‌ కళాశాల కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కళాశాలకు అనుబంధంగా అన్ని రకాల వసతులతో ఉన్న 500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా అందుబాటులోకి వస్తాయని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో ఆరోగ్య హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వీటిలో ఆస్పత్రులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఒక్కొక్కరికీ 5 ఎకరాలు భూమి ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. 100 కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రోత్సాహకాలిస్తామన్నారు. ఫలితంగా రాష్ట్రంలో మరో 90 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 10వేల 111 వైఎస్సార్ విలేజ్‌ క్లినిక్‌లు, 560 అర్బన్‌ హెల్త్‌క్లినిక్‌లు ఏర్పాటు ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు.

గిరిజనులకు అత్యుత్తమ వైద్య సేవల కోసం 246 కోట్లతో.. సీతంపేట, బుట్టాయిగూడెం, పార్వతీపురం, రంపచోడవరం, దోర్నాలలో.. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు శ్రీకారం చుట్టినట్లు సీఎం తెలిపారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కొవిడ్‌తో చనిపోతే 5 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి

Anil Singhal: కర్ఫ్యూ అమలు తర్వాత కరోనా కేసులు తగ్గాయి: సింఘాల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.