ETV Bharat / city

తాడేపల్లికి ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి పంచాయితీ.. సీఎం​ ఆగ్రహం - తాడేపల్లికి చేరిన ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి పంచాయితీ

cm jagan fire on Jakkampudi Raja and MP Bharat controversy
తాడేపల్లికి చేరిన ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి పంచాయితీ
author img

By

Published : Sep 28, 2021, 12:19 PM IST

Updated : Sep 29, 2021, 2:56 AM IST

12:14 September 28

వైకాపా నేతల పరస్పర ఆరోపణలపై సీఎం ఆగ్రహం

వైకాపా నేతల పరస్పర ఆరోపణలపై సీఎం ఆగ్రహం

పరస్పర తీవ్ర విమర్శలు, బహిరంగ ఆరోపణలతో.. రాజమహేంద్రవరంలో అధికార పార్టీలో రభస సృష్టించిన నేతలపై సీఎం జగన్(fight between rajamahendravaram ysrcp leaders reached cm jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మార్గాని భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను తాడేపల్లికి పిలిపించారు. వారిద్దరి వ్యవహారశైలిపై విస్మయం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ఇద్దరి దగ్గర వివరణ తీసుకోవాలని.. తూర్పుగోదావరి జిల్లా వైకాపా ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డిని ఆదేశించారు. సోమవారం ఉదయం ఇద్దరూ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోగా.. వారితో సుబ్బారెడ్డి వేర్వేరుగా భేటీ అయ్యారు. మొదట.. భరత్‌పై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రాజా వద్ద వివరణ తీసుకున్నారు. ఆరోపణలపై ఆధారాలున్నాయా.. ఎందుకు మీడియా ముందుకు వెళ్లాల్సి వచ్చిందనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజనానంతరం ఎంపీ మార్గాని భరత్‌తో సమావేశమైన వైవీ సుబ్బారెడ్డి(yv subba reddy).. ఆయన వద్ద వివరణ తీసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకురావాలే తప్ప రచ్చకెక్కడం తగదని.. ఇద్దరికీ సుబ్బారెడ్డి ఆదేశించారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. ఇదే వైఖరి కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని సూచించారు. సాయంత్రం వారిద్దరిని వెంటబెట్టుకుని వైవీ సుబ్బారెడ్డి.. సీఎం జగన్‌ను కలిశారు. ఇరువురితో చర్చించిన అంశాలు, వారు ఇచ్చిన వివరణను సీఎంకు తెలిపారు. ఇద్దరితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. క్రమశిక్షణతో మెలగాలని.. బహిరంగ వేదికలపై రచ్చ చేయవద్దని గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. గీత దాటితే ఎంతటివారినైనా ఉపేక్షించబోనని.. కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్టు తెలిసింది. సీఎం ఆగ్రహంతో ఇద్దరు నేతలూ మెత్తబడినట్టు.. ఇకపై కలిసికట్టుగా ఉంటామని సీఎంకు హామీ ఇచ్చినట్టు సమాచారం. సీఎంతో భేటీపై రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడతానని సమావేశం అనంతరం ఎంపీ భరత్ తెలపగా.. జక్కంపూడి రాజా మాత్రం మీడియా కంట పడకుండా తాడేపల్లి నుంచి వెళ్లిపోయారు. 

వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటే.. 

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా.. కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేశారని ఎంపీ భరత్‌పై జక్కంపూడి రాజా ఇటీవల పరోక్ష విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ భరత్‌ మాట్లాడుతూ.. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుని తనపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు. 

  •  సంబంధిత కథనం.. 

సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు

Last Updated : Sep 29, 2021, 2:56 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.