ETV Bharat / city

Compassionate appointments: కారుణ్య నియామకాలు చేపట్టాలి: సీఎం జగన్

CM Jagan directed that compassionate appointments be made immediately
కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి.. సీఎం జగన్ ఆదేశం
author img

By

Published : Oct 18, 2021, 5:57 PM IST

Updated : Oct 19, 2021, 5:56 AM IST

17:53 October 18

నవంబరు 30లోగా కారుణ్య నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న సీఎం

కొవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నియామకాల(cm jagan on compassionate appointments ) కింద ఉద్యోగాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. నవంబరు 30నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కొవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ముఖ్యమంత్రి సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు(cm jagan review). పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో సిబ్బంది నియామకాల్లో జాతీయ ప్రమాణాలను అనుసరించాలని, దీనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని సీఎం ఆదేశించారు. వివిధ ఆసుపత్రుల్లోని ఖాళీలు, అవసరాల మేరకు సిబ్బంది నియామకానికి క్యాలెండర్‌ రూపొందించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూలో పోస్టుల భర్తీకి అక్టోబరు 20న నోటిఫికేషన్‌ ఇస్తామని, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి డిసెంబరు 10న నియామక ఉత్తర్వులు అందజేస్తామని తెలిపారు. డీఎంఈలో పోస్టులకు అక్టోబరు 20న నోటిఫికేషన్‌, డిసెంబరు 5న నియామక ఉత్తర్వులు ఇస్తామని అన్నారు.
ఏపీవీవీపీలో పోస్టులకు అక్టోబరు20 నుంచి 23 వరకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి డిసెంబరు 21-25 మధ్య నియామక ఉత్తర్వులు అందజేస్తామని వెల్లడించారు. కొత్తగా 176 పీహెచ్‌సీల నిర్మాణంపై వెంటనే దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించగా.. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లోగా పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

అక్టోబరు నెలాఖరుకు ఆక్సిజన్‌ ప్లాంట్లు సిద్ధం
రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 140 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల (పీఎస్‌ఏ) పనులు చురుగ్గా జరుగుతున్నాయని, ఈ నెలాఖరుకు అవన్నీ అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలోని 12,833 సచివాలయాల పరిధిలో ఒక్క కొవిడ్‌ కేసు కూడా లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,034 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 12 జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0 నుంచి 3శాతంలోపు, ఒక జిల్లాలో 3 నుంచి 5 శాతంలోపు ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,33,80,259 మంది తొలి డోస్‌ వ్యాక్సిన్‌, 1,66,58,195 మంది రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 

CM Jagan review on power: థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలి: సీఎం జగన్

Last Updated : Oct 19, 2021, 5:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.