కరోనా నియంత్రణ, వ్యాక్సిన్ విషయాలపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు, నియంత్రణపై ప్రధానికి సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ, జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి సీఎం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
15 రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ప్రధానికి సీఎం జగన్ తెలిపారు. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో కేసులు పెరిగినట్లు వివరించారు.
ఈనెల 1 నుంచి 15 వరకు కృష్ణా జిల్లాలో 171 శాతం పెరిగాయని.. తూర్పుగోదావరి జిల్లాలో 150 శాతం, విశాఖలో వంద శాతం పెరిగినట్లు ప్రధానికి తెలిపారు. చిత్తూరులో 92 శాతం, గుంటూరులో 70 శాతం పెరిగినట్లు సీఎం వివరించారు.
ఇదీ చదవండి: రసవత్తరం.. తాడిపత్రి ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం