ETV Bharat / state

'యురేనియం తవ్వకాలు' - కప్పట్రాళ్లలో నిజనిర్ధారణ కమిటీ పర్యటన - DEVANAKONDA URANIUM MINING

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనల నేపథ్యంలో పర్యటన - వాస్తవాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ

devanakonda_uranium_mining
devanakonda uranium mining (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 5:45 PM IST

DEVANAKONDA URANIUM MINING: యురేనియం తవ్వకాల విషయంలో అసత్య ప్రచారాలు నమ్మొద్దని తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అన్నారు. కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో పర్యటించిన నేతలు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ధైర్యం చెప్పారు. యురేనియం తవ్వకాలు ఎక్కడా జరగట్లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసే ప్రయత్నం చేస్తామని తెలుగుదేశం నేతలు అన్నారు.

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో యురేనియం తవ్వకాలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. యురేనియం తవ్వకాలపై గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను ప్రజలకు వివరించడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కరెడ్డి, కోడుమూరు, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు, ఆలూరు, కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్​లు వీరభద్ర గౌడ్ ప్రజలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కరెడ్డి మాట్లాడుతూ యురేనియం తవ్వకాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంపై బురద వేస్తున్నారని విమర్శించారు. ఎన్డీయే కూటమి ప్రజల కోసం పని చేస్తుందని, మీ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఎటువంటి యురేనియం తవ్వకాలు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు మాట్లాడుతూ, అధికారం లేకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం పద్ధతి కాదని, ప్రజలు గమనించాలని కోరారు. ఇక్కడ యురేనియం తవ్వకాలు చేస్తే తమ కంబలపాడు గ్రామం కూడా నష్టపోతుందని, ఇది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు. ఇప్పుడిప్పుడే దేవనకొండ మండలం అభివృద్ధి చెందుతోందని, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి చూడలేక ప్రజలను వైఎస్సార్సీపీ నాయకులు మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని, అదే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తోందని, దీనిని ప్రజలంతా అర్థం చేసుకోవాలని, ఇక్కడ ఎటువంటి యురేనియం తవ్వకాలు చేయరని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

యురేనియం అనుమతులు రద్దు చేయకపోతే ఉద్యమిస్తాం - 15 గ్రామాలు హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.