ETV Bharat / city

TNSF PRANAV : 'ఎయిడెడ్ పాఠశాలల్ని మూసివేయటం సిగ్గుచేటు' - కృష్ణా జిల్లా వార్తలు

వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేవి మూసేసి, ప్రజల భవిష్యత్​ని నాశనం చేసే వాటిని ప్రోత్సహిస్తోందని టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్​గోపాల్ మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా పాలన ‎ తీరు వింతగా ఉందని ఎద్దేవా చేశారు.

TNSF PRANAV
టిఎన్ఎస్ఎఫ్ ప్రణవ్
author img

By

Published : Oct 28, 2021, 2:13 PM IST

వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేవి మూసేసి, ప్రజల భవిష్యత్​ని నాశనం చేసే వాటిని ప్రోత్సహిస్తోందని టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్​గోపాల్ మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా పాలన ‎తీరు వింతగా ఉందని ఎద్దేవా చేశారు. మద్యం దుకాణాలు, యువతను మత్తుకు బానిసల్ని చేస్తున్న గంజాయి స్థావరాల్ని మూసేయమని ప్రజలు కోరుతున్నారన్నారు. యువత బానిసయ్యే వాటి‎ గురించి పట్టించుకోని జగన్ పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు, పేద విద్యార్థుల భవిష్యత్తులో వెలుగులు నింపే ఎయిడెడ్ పాఠశాలల్ని మూసివేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మూసివేయాల్సింది పాఠశాలలు కాదు.. మద్యం దుకాణాలు, గంజాయి స్ధావరాలు, పేకాట క్లబ్బులని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TNSF PRANAV
ఎయిడెడ్ పాఠశాలల్ని మూసివేయటం సిగ్గుచేటు

విద్యా ప్రాముఖ్యతను గ్రహించిన ఎంతోమంది స్థలాలు, ఆస్తులు ఎయిడెడ్ పాఠశాలలకు ఇస్తే నేడు సీఎం మాత్రం విద్యార్థుల భవిష్యత్ ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకురన్నారు. విద్యా రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను పునరుద్ధరించాల్సింది పోయి...మూసేయాలని ఏకపక్షంగా నిర్ణయించడం దారుణమన్నారు. వాటి మూతతో లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని, వేల కోట్ల విలువైన భూములు కైంకర్యం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టించటం చేతకాక రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముతున్న జగన్ రెడ్డికి ఇప్పుడు ఎయిడెడ్ విద్యాసంస్ధల ఆస్తులపై కన్నుపడిందని ఆరోపించారు.

ఇదీ చదవండి : pattabhi: పట్టాభిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్‌ కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.