ETV Bharat / city

పెరిగింది అవగాహన... కొలువుదీరింది మట్టి ప్రతిమ - విజయవాడ

ఊరూవాడ వినాయకచవితి సందడిగా నెలకొంది. వాడవాడలా భిన్నరూపాల వినాయకులు కొలువు తీరుతున్నారు. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెరగటంతో చాలా ప్రాంతాల్లో మట్టి వినాయకులను ప్రతిష్టించారు.

పెరిగింది అవగాహన... కొలువుదీరింది మట్టి ప్రతిమ...
author img

By

Published : Sep 2, 2019, 4:27 PM IST

పెరిగింది అవగాహన... కొలువుదీరింది మట్టి ప్రతిమ...

వినాయకచవితి సంబురాలతో ఊరూవాడ సందడిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఉదయాన్నే పూజలు మొదలు పెట్టారు. విస్తృత ప్రచారంతో చాలా ప్రాంతాల్లో మట్టి ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. పర్యావరణంపై అవగాహన పెంచుకున్న ప్రజలు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌కు దూరంగా ఉన్నారు.

చైతన్యం కలిగిస్తూ... ప్రతిమలు పంచుతూ..
అనంతపురానికి చెందిన పర్యావరణ ప్రేమికులు మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలనీ ఉచితంగా మట్టి గణనాథులను పంపిణీ చేశారు. గతంలో ప్రజలు మట్టి వినాయకులపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు కానీ ఇప్పుడు ఊరూవాడ గరిష్ఠస్థాయిలో మట్టి వినాయకులనే ప్రతిష్ఠించారు. గుంటూరులో 30అడుగుల మట్టి వినాయకుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. విజయవాడలో ఎక్కడిక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మట్టి గణనాథులను పంపిణీ చేశారు.

మట్టితో ప్రకృతికి మేలు... విత్తనాలతో పుడమికి మేలు..
ఒంగోలులోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు విత్తన గణనాథులు చేశారు. మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడితే... విత్తనాలు వేస్తే ప్రకృతికి ఓ రూపం ఇచ్చినట్లవుతుందని వీరి అభిప్రాయం. అనంతపురం జిల్లాలోని ఆకృతి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులూ ఇదే పద్దతి అనుసరించారు. అనంతపురం జిల్లా వంటి ప్రాంతంలో మొక్కలు మొలకెత్తి... వర్షాలు కురిసేందుకు సహకరిస్తాయని వీరంతా చెబుతున్నారు.

విగ్రహాల తయారీతో జీవనోపాధి..
శ్రీకాకుళం జిల్లాలోనూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమల కంటే మట్టి విగ్రహాలు కొనడానికే ప్రజలు మొగ్గు చూపారు. వినాయకచవితి ప్రతిమలు తయారుచేసే కుటుంబాలకూ అన్నం పెడుతోంది. ఎక్కడినుంచో వచ్చి ఉత్తరాంధ్రాలో మట్టి గణనాథులు చేసుకుంటూ.. జీవనోపాధి పొందుతున్నారు. ఏకదంతుడి పండుగను ఎకో ఫ్రెండ్లీగా చేసుకుందామని అంతా ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి

నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు

యాంకర్ వాయిస్: కడప జిల్లా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 10 వర్ధంతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద తన తండ్రికి సమాధికి పూలమాలవేసి క్రైస్తవ అ పద్ధతిలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాటు ప్రాంగణంలోని విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు . ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోదరి షర్మిల జగన్ భార్య సతీమణి భారతి రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిప్యూటీ సీఎం అంజాద్బాష చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఇ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్ రెడ్డి గోవింద్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి తో పాటు వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యా నివాళులర్పించారు. అనంతరం పులివెందులకు బయలుదేరి వెళ్లారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.