ETV Bharat / city

ప్రజావ్యతిరేక చట్టాలను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రతులు దగ్ధం - citu protest at ap

కేంద్రం తీసుకొచ్చిన ప్రజావ్యతిరేక చట్టాలను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అప్రజాస్వామికంగా ఉన్న బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆ బిల్లుల ప్రతులను దగ్ధం చేశారు.

citu protest against central bills
ప్రజావ్యతిరేక చట్టాలను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
author img

By

Published : Feb 3, 2021, 9:24 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. చట్టాలను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లాలో...

కేంద్రం అప్రజాస్వామికంగా తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లును వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఏడు రోడ్లు కూడలిలో నిరసన చేపట్టారు. మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసిందన్నారు. ఈ కోడ్లను తాము ఆమోదించడం లేదని కార్మిక సంఘాలు చెప్పినా కేంద్రం ఖాతరు చేయలేదన్నారు. చివరికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులనూ తిరస్కరించిందని విమర్శించారు.

కృష్ణా జిల్లాలో...

కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ విజయవాడ లెనిన్ కూడలిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణలు 2020 బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్​లో కేవలం కార్పొరేట్లు, ధనిక వర్గాలే లబ్ధి చేకూర్చేలా ఉందని.. పేద ,మధ్య తరగతి ప్రజల ఊసే లేదని విమర్శించారు.

అనంతపురం జిల్లాలో...

దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి కుట్రలు చేస్తోందని కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షుడు అమీర్ భాషా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనంతపురంలో ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద చట్టాల పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని.. ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక, రైతు వ్యతిరేక చట్టాల పత్రాలను దహనం చేశారు. మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని.. దేశ సంపదను అంబానీ ,అదానీలకు దోచి పెడుతోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్ విమర్శించారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాల్సిందిపోయి నూతన చట్టాలతో వేధిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కాకులను కొట్టి.. గద్దలకు వేసే చందంగా ఉంది అని రమేశ్ అన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

కేంద్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ కోరారు. విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో పూలే విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ చట్టాలకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ... రాజపత్రం, జీవో కాపీలను కాల్చి నిరసన తెలిపారు.

విశాఖపట్నం జిల్లాలో..

మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు విశాఖలో ఆందోళన చేపట్టాయి. కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా జాతీయ నిరసన దినాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘం నాయకులు నిర్వహించారు. కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్​లు, రైతులకు వ్యతిరేకంగా ఉన్న సాగు చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కేంద్రం తీరుని వ్యతిరేకిస్తూ విద్యుత్ చట్ట ప్రతులను దగ్ధం చేశారు.

నెల్లూరు జిల్లాలో..

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ... నెల్లూరులో ప్రజా సంఘాల ఐక్యవేదిక 24గంటల నిరాహార దీక్ష చేపట్టింది. నగరంలోని హరనాథపురం సెంటర్ వద్ద ఈ దీక్షను ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. రైతాంగానికి నష్టం చేకూర్చే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.

వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీసి, వాకౌట్ చేస్తే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కనీసం నిరసన కూడా తెలపకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో రైతుల పక్షాన మాట్లాడుతున్న ప్రధాన పార్టీల నేతలు, పార్లమెంట్​లో మౌనం వహింంచడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇద చూడండి: గుర్రంపై తిరుగుతూ.. ఇంటింటికి కూల్​డ్రింక్​లు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.