ETV Bharat / city

'రాహుల్ తప్పేమీ లేదు.. తన వెంట నేనుంటా..' - ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌తో ప్రముఖ పాప్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ భేటీ

పబ్​లో జరిగిన గొడవలో రాహుల్ సిప్లిగంజ్ తప్పేమీ లేదని సినీ నటుడు ప్రకాష్​రాజ్ తెలిపారు. అతని వెంట తానుంటానని హామీ ఇచ్చారు. పది మందితో కలిసి ఒక్కడిపై దాడి చేయడం దారుణమన్నారు.

cine-actor-prakash-raj-speaks-abou-rahul-sipligunj-pub-issue
'రాహుల్ తప్పేమీ లేదు.. తన వెంట నేనుంటా..'
author img

By

Published : Mar 9, 2020, 7:23 PM IST

'రాహుల్ తప్పేమీ లేదు.. తన వెంట నేనుంటా..'

అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌తో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్, ప్రముఖ పాప్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ భేటీ అయ్యారు. ఓ కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసమే... ఆయనను కలిసినట్లు ప్రకాష్​రాజ్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత పని మీదే వినయ్​భాస్కర్​ను కలవడానికి వచ్చినట్లు తెలిపారు. ఇటీవల పబ్​లో రాహుల్ సిప్లిగంజ్​పై జరిగిన గొడవ గురించి కూడా ఆయన స్పందించారు. రాహుల్​కు అన్యాయం జరిగిందని, అతని వెంటే తానుంటానంటూ సినీనటుడు ప్రకాష్​రాజ్ వెల్లడించారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. పబ్​లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీలేదన్నారు. అతని తప్పు లేనపుడు ఎందుకు రాజీపడాలని ప్రశ్నించారు. పబ్​కు వెళ్లడం తప్పు కాదని, కానీ పది మందితో కలిసి ఒక్కరిని కొట్టడం దారుణమని ప్రకాష్ రాజ్ తెలిపారు.

ఇవీ చూడండి: నలుగురు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన వైకాపా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.