Chiranjeevi meets CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. సినిమా టిక్కెట్ల ధరలు పెంచడంతోపాటు సినీ పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరినట్లు చిరంజీవి తెలిపారు. సీఎం జగన్‌తో గంటన్నరపాటు చర్చించిన చిరంజీవి.. సినిమా పరిశ్రమ సమస్యలను సీఎంకు వివరించారు. కొవిడ్ దృష్ట్యా సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని జగన్‌కు విన్నవించినట్లు చిరంజీవి తెలిపారు.
చిరంజీవి పేర్కొన్న అంశాలను నోటు చేసుకున్న జగన్.. మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. సినీపరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గించాలని.. సమావేశంలో ఇరువురు నిర్ణయించారు.
ఇదీ చదవండి.. : CM YS Jagan - Chiranjeevi: ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ..సినిమా టికెట్ల ధరలపై చర్చ