కేసు విచారణ నిమిత్తం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను విజయవాడలోని న్యాయస్థానంలో పోలీసులు హాజరుపర్చారు. 2011లో... పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేలు నిర్వహించిన సందర్భంగా అప్పట్లో చింతమనేనిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చారు. అసాధారణరీతిలో వజ్ర వాహనంలో భారీ భద్రత నడుమ కోర్టుకు తీసుకొచ్చారు. రాకపోకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు విచారించేందుకు విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమార్తి ఎదుట హాజరుపరిచారు.
ఇదీ చదవండీ... కేబినెట్ కీలక నిర్ణయం... మరో కొత్త పథకానికి శ్రీకారం..!