ETV Bharat / city

Chinta Mohan: '2024లో కాంగ్రెస్ పార్టీదే అధికారం'

రాష్ట్రంలో 85 లక్షల మందికి ఉపకార వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్(Chinta Mohan) అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులు నానా అవస్థలు పడాల్సి వస్తోందని తెలిపారు. 6 తరగతి నుంచి స్కాలర్​షిప్ తీసుకున్న వ్యక్తిగా.. ఇప్పుడు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసన్నారు.

Chinta Mohan
Chinta Mohan
author img

By

Published : Oct 1, 2021, 3:19 PM IST

రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందడం లేదని.. కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్‌(Chinta Mohan) ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వాటా 75 శాతం నిధులు ఇచ్చినా విద్యార్థులకు చెల్లించకుండా.. ఇతర కార్యక్రమాలకు మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో 85 లక్షల మంది స్కాలర్​షిప్ రాక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రశాంతంగా చదువుకునే అవకాశం కల్పించకుండా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు సరిదిద్దుకుని, నవంబర్‌ 1వ తేదీ కల్లా ఉపకార వేతనాలను విడుదల చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఆస్తులు, రోడ్లు, పోర్టులు అమ్మేయడం ఏమిటని నిలదీశారు. పెట్రోల్ ధరలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల చట్టాలపై రైతుల ఆందోళనలు.. మోదీని గద్దె దింపుతాయన్నారు. 2024లో దేశవ్యాప్తంగా, ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

ఇదీ చదవండి: YCP Vs PAWAN: సినిమాలు లేకపోతేనే పవన్ ప్రజల్లోకి వస్తారు: మంత్రి శంకరనారాయణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.