కృష్ణా జిల్లా గుడివాడ ఆంధ్రాబ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) నుంచి లోన్ తీసుకుని ఎగవేసిన కేసులో బ్యాంకు మాజీ మేనేజర్ ఎస్.రామచంద్రరావు, వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఎండీ నిమ్మగడ్డ రామకృష్ణలపై ఈడీ ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. బ్యాంకు నుంచి తీసుకున్న రూ.36.97 కోట్ల రుణాన్ని ఉద్దేశించిన పనికి వినియోగించకుండా ఓ సినిమాకు పెట్టుబడులుగా పెట్టారన్నారు. అనంతరం రుణం తిరిగి చెల్లించకపోవటంతో వడ్డీతో కలుపుకొని రూ.54.64 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఈడీ పేర్కొంది. నగదు అక్రమ రవాణా నివారణ చట్టానికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్న ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు తెలిపింది.
ఇవీ చూడండి: