ETV Bharat / city

Cheat: కాసుల కోసం కట్టుకున్న భార్యనే మార్చేశాడు ! - ప్రభుత్వ రుణం కోసం భార్యనే మార్చాడు

ప్రభుత్వ రుణం పొందేందుకు భార్యనే మార్చాడో ప్రబుద్ధుడు. తన భార్య స్థానంలో మరో మహిళను భార్యగా చూపించి పొదుపు సంఘంలో రుణాన్ని పొందాడు. అనంతరం ఆ డబ్బుతో ఉడాయించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా విస్సన్నపేటలో చోటుచేసుకుంది.

కాసుల కోసం కట్టుకున్న భార్యనే మార్చేశాడు

author img

By

Published : Feb 1, 2022, 8:43 PM IST

భార్యకు ప్రభుత్వం రుణంగా ఇచ్చిన డబ్బును తన సొంతం చేసుకునేందుకు ఆమె స్థానంలో వేరే మహిళను భార్యగా చూపించి నగదు తీసుకుని పరారైన భర్త ఉదంతమిది. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చల్లా నిర్మల శ్రీసాయి స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉంటూ ఎప్పటికప్పుడు పొదుపు, గత రుణానికి సంబంధించిన మొత్తాన్ని సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త శ్రీను మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకుని మూడు మాసాల క్రితం భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ఇదే సమయంలో నిర్మల సభ్యురాలిగా ఉన్న సంఘానికి రూ.10లక్షల నగదును ప్రభుత్వం రుణంగా మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని సంఘం అధ్యక్షురాలు సభ్యులందరికీ ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు జమ చేశారు. నిర్మల పుట్టింటికి వెళ్లటంతో ఆమె బ్యాంకు పాస్‌పుస్తకంలో ఫొటోను మార్చాడు. అంతేకాదు సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను తన భార్యగా స్థానిక సప్తగిరి బ్యాంకు అధికారులను నమ్మించి నగదు మొత్తాన్ని విత్‌డ్రా చేశారు.

విషయం తెలుసుకున్న నిర్మల బ్యాంకు అధికారులను ఆశ్రయించగా అప్పటికే శ్రీను నగదు డ్రా చేసిన మహిళతో ఉడాయించాడు. విషయం బయటకు వస్తే తమ బ్యాంకు పరువుపోతుందని భావించిన బ్యాంకు అధికారులు కొందరు గ్రామపెద్దల సాయంతో నిర్మలతో రాజీ చేసుకుని ఆమె పేరుతో కొత్త ఖాతా ప్రారంభించి కొంత నగదును అందులో జమ చేశారు. ఈ సంఘటనపై బాధితురాలు నిర్మలను విచారించగా తన భర్త తనకు మంజూరైన నగదుతో మరో మహిళతో పరారయ్యాడని తెలిపింది, బ్యాంకు మేనేజర్‌ రఘును విచారించగా నిర్మల ఖాతాలో నగదు దుర్వినియోగమైనా ఆమెకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. నిర్మల ఖాతాకు జమ అయిన మొత్తాన్ని ఆమెకు తెలియకుండా ఆమె భర్త డ్రా చేసి, పరారైన మాట వాస్తవమేనని వెలుగు సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండి

అక్రమార్జనకు పాల్పడుతూ అడ్డంగా బుక్కైన ఎక్సైజ్ సీఐ, ఎస్​ఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.