తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తొలి 10 ర్యాంకుల్లో ఎన్టీఆర్ విద్యాసంస్థల విద్యార్థులు నిలిచి సంస్థ ప్రతిష్టను పెంచారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. తెలంగాణ ఇంటర్ టాపర్, ఎన్టీఆర్ మెమోరియల్ కాలేజ్ విద్యార్థిని నిత్యాగౌడ్కు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ విద్యాసంస్థలలోని విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించడం సంతోషకరమన్నారు.
-
ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తిగా స్థాపించబడిన @ntrtrust ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎన్టీఆర్ విద్యాసంస్థల లోని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ... ఇంటర్ ఫలితాలలో మెరుగైన ర్యాంకులు సాధించడం సంతోషకరం.(1/3) pic.twitter.com/Rh1mmdbiAA
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తిగా స్థాపించబడిన @ntrtrust ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎన్టీఆర్ విద్యాసంస్థల లోని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ... ఇంటర్ ఫలితాలలో మెరుగైన ర్యాంకులు సాధించడం సంతోషకరం.(1/3) pic.twitter.com/Rh1mmdbiAA
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2022ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తిగా స్థాపించబడిన @ntrtrust ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎన్టీఆర్ విద్యాసంస్థల లోని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ... ఇంటర్ ఫలితాలలో మెరుగైన ర్యాంకులు సాధించడం సంతోషకరం.(1/3) pic.twitter.com/Rh1mmdbiAA
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2022
తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర టాప్ ర్యాంకర్‌గా ఎన్టీఆర్ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ విద్యార్థిని ఇ.నిత్యాగౌడ్ నిలిచారు. అలాగే.. వివిధ గ్రూప్‌ల్లో మొదటి పది ర్యాంకులు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో ఎన్టీఆర్ విద్యాసంస్థల ప్రతిష్టను ఇనుమడింపచేసిన విద్యార్థులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు, ఎన్టీఆర్ విధ్యాసంస్థల అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ఈమేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: