ETV Bharat / city

వైద్యులకు వందనాలు.. శుభాకాంక్షలు: చంద్రబాబు - చంద్రబాబు నాయుడు వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా విపత్తు సమయంలో వైద్యులు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

CHANDRABABU WISHES TO DOCTORS ON  NATIONAL DOCTORS DAY
వైద్యులకు చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు
author img

By

Published : Jul 1, 2021, 10:18 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు "జాతీయ వైద్యుల దినోత్సవం" సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కష్టకాలంలో వైద్యులు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసీ... కరోనా బాధితులకు డాక్టర్లు సేవలు చేస్తున్నారని, వృత్తి ధర్మం పట్ల అంకితభావంతో రాత్రింబవళ్లు రోగులను కాపాడేందుకు శ్రమిస్తున్నారని ప్రశంసించారు.

వైద్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లకు కనీసం రక్షణ పరికరాలు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఇదీ చదవండి:

బండ బాదుడు: మళ్లీ పెరిగిన వంట గ్యాస్​ ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.