ETV Bharat / city

తొలి విడత నామినేషన్లతో ఖంగుతిన్న జగన్ రెడ్డి: చంద్రబాబు - తొలి విడత నామినేషన్లతో ఖంగుతిన్న జగన్ రెడ్డి

బలవంతపు ఏకగ్రీవాలు చేయాలన్న అధికార పార్టీ కుట్రలను ప్రజలే నిర్విర్యం చేశారని తెదేపా అధనేత చంద్రబాబు అన్నారు. తెదేపా శ్రేణుల నైతికబలం దెబ్బ తీయాలనే తప్పుడు పనులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులకు కేరాఫ్ అడ్రస్​గా 'వైకాపా' మారిందన్నారు.

cbn on first phase nominations
తొలి విడత నామినేషన్లతో ఖంగుతిన్న జగన్ రెడ్డి
author img

By

Published : Feb 2, 2021, 10:49 PM IST

తొలివిడత నామినేషన్లు భారీగా దాఖలు కావడంతో జగన్ రెడ్డి ఖంగుతిన్నారని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. బెదిరించి బలవంతపు ఏకగ్రీవాలు చేయాలన్న వైకాపా కుట్రలను ప్రజలే భగ్నం చేశారని విమర్శించారు. తెదేపా నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటమి భయంతో తెదేపా శ్రేణుల నైతికబలం దెబ్బ తీయాలనే తప్పుడు పనులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తొలి దశలో స్వల్పకారణాలతో స్క్రూట్నీలో నామినేషన్లను తిరస్కరించారని ఆక్షేపించారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణలో తొలి విడత అభ్యర్ధులంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. రెండో విడత ఎన్నికల గ్రామాల్లో కూడా భారీగా నామినేషన్లు వేయాలని కోరారు. వైకాపా బెదిరింపులపై ఆధారాలతో జిల్లా కలెక్టర్లు, ఎన్నికల సంఘం, తెదేపా కంట్రోల్ రూమ్​కు ఫిర్యాదు కాపీల నకళ్లతో సహా జతచేసి పంపాలని వివరించారు. తెదేపా కంట్రోల్ రూమ్​లో లీగల్ సెల్ అడ్వకేట్లు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు. బెదిరించి ఏకగ్రీవం చేయాలనే వైకాపా దుర్మార్గాలను తిప్పికొట్టాలని.. పోటీలో ఉండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ఆకాక్షించారు.

వేధింపులకు కేరాఫ్ అడ్రస్ ​'వైకాపా'

వేధింపులకు కేరాఫ్ అడ్రస్​గా వైకాపా మారిందన్న చంద్రబాబు.. ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే హత్యలు, కిడ్నాప్​లు, తప్పుడు కేసులు, హింసా, విధ్వంసాలే వైకాపా పంచసూత్రాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఉన్మాదంతో వైకాపా తన గొయ్యి తానే తవ్వుకుంటోందన్నారు. ప్రజలతో తెదేపా ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పోరాడుతామన్నారు. పోలీసులు లేకుండా జనంలోకి రాలేని పరిస్థితి వైకాపాదని చంద్రబాబు విమర్శించారు.

ఇదీ చూడండి: పంచాయతీ ఎన్నికలపై ఫిర్యాదులకు 'ఈ వాచ్' యాప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.