ETV Bharat / city

అచ్చెన్న బందిపోటా, ఉగ్రవాదా?:చంద్రబాబు

జగన్ అవినీతిని ఎండగట్టారనే అచ్చెన్నపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారన్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో ఎదుర్కోలేకే ఇలాంటి దుర్మార్గాలకు తెగించారని ధ్వజమెత్తారు. వందల మందిని పంపి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని..అచ్చెన్నాయుడు ఏమైనా ఉగ్రవాదా? అని ప్రశ్నించారు.

జగన్ అవినీతిని ఎండగట్టారనే అచ్చెన్నపై కక్షసాధింపు: చంద్రబాబు

author img

By

Published : Jun 12, 2020, 11:48 AM IST

Updated : Jun 13, 2020, 5:38 AM IST

తెదేపా శాసనసభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు వ్యవహారంపై విజిలెన్స్‌ నివేదికలో అచ్చెన్న పేరే లేనప్పుడు ఎలా అరెస్టు చేస్తారని దుయ్యబట్టారు. ‘అచ్చెన్నాయుడిని తమ పార్టీలోకి లాక్కునేందుకు వైకాపా వందల కోట్లు ఆఫర్‌ చేసింది. రాను.. నిజాయతీగా ఉంటానని ఆయన చెప్పడంతో ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో ఆయన ప్రమేయముందని ప్రచారం చేశారు. నేను తప్పు చేయలేదు.. ఇలానే ఉంటానని అచ్చెన్న స్పష్టం చేయడంతో దొంగ దెబ్బ కొట్టారు’ అని మండిపడ్డారు. ‘అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి? జగన్‌లా దోచుకున్న డబ్బుతో ప్యాలెస్‌లు కట్టారా? డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారా? అడ్డూఆపూ లేని మీ దోపిడీపై పోరాడటమే తప్పా? గౌరవ ప్రజాప్రతినిధి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? కరోనా భయపెడుతున్న తరుణంలో 300 మంది పోలీసులు వెళ్లారు. 50 మంది పోలీసులు అచ్చెన్న ఇంట్లోకి చొరబడ్డారు. తనకు శస్త్రచికిత్స జరిగింది రాలేనని చెప్పినా వినలేదు. మందులు తీసుకోవడానికీ అనుమతించకుండా ఎత్తుకొచ్చి వాహనంలో పడేశారు. ఆయన భార్యకు, కుమారుడికి కూడా చెప్పలేదు. అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? ఆయనేమైనా ఉగ్రవాదా? బందిపోటా? పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయం’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. అచ్చెన్నకు మద్దతుగా శనివారం నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూనే తెదేపా ‘వర్చువల్‌’ ఆందోళన నిర్వహిస్తుందని ప్రకటించారు. ఈ పోరాటానికి మిగిలిన ప్రతిపక్షాలు, ప్రజలూ కలసిరావాలని పిలుపునిచ్చారు.

ముందు రోజే ఎలా తెలిసింది?
‘అచ్చెన్నను శుక్రవారం ఉదయం 7.20కి అరెస్టు చేశారు. కానీ.. ‘అచ్చెన్నాయుడిపై రేపు దాడి జరగబోతోందా?’ అంటూ వైకాపా నాయకులు గురువారం రాత్రి 11.45కే యువసేన పేరుతో సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. పోలీసులు అచ్చెన్న ఇంటికి వెళ్లినప్పుడు.. గ్రామస్థులు చూడడానికి వస్తే కరోనా నిబంధనలున్నాయంటూ గద్దించి పంపించేశారు. నిబంధనలు వాళ్లకేనా? పోలీసులకు వర్తించవా? ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ఇంట్లోకి వెళ్లాక ఏసీబీ డీఎస్పీ అప్పటికప్పుడు రాసి ఆయన చేతిలో పెట్టారు. ఇదెక్కడి దారుణం? రెండు రోజుల క్రితమే ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తిని రాష్ట్రమంతటా తిప్పి విజయవాడకు తీసుకొచ్చారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

మందుల కొనుగోళ్లతో మంత్రికేం సంబంధం?
‘విజిలెన్స్‌ నివేదికలో అచ్చెన్న పేరు లేకపోయినా ఏసీబీ తమకు అనుకూలంగా కథనాన్ని సిద్ధం చేసింది. ఐఎంఎస్‌ డైరెక్టర్లుగా పనిచేసిన రవికుమార్‌, రమేష్‌కుమార్‌, విజయకుమార్‌ల పేర్లనే విజిలెన్స్‌ నివేదికలో ప్రస్తావించారు. మందుల కొనుగోళ్లలో మంత్రి పాత్ర ఉంటుందని ‘పర్చేజ్‌ మాన్యువల్‌’లోనూ లేదు. జీవోనెం.51 ప్రకారం కూడా మందుల కొనుగోళ్లలో మంత్రులకు ఏ అధికారం లేదు. కొనుగోళ్ల కమిటీదే బాధ్యత. అందుకే తెలంగాణలో ఈఎస్‌ఐ మందుల కుంభకోణం దర్యాప్తులో మంత్రిని అరెస్టు చేయలేదు’ అని చంద్రబాబు తెలిపారు.

అనేక విధాలుగా అవమానం
‘అచ్చెన్నాయుడిని వైకాపా నాయకులు అనేక విధాలుగా అవమానించారు. అసెంబ్లీలోనే దుర్భాషలాడారు. ఇప్పటివరకు దళితులపై దాడి చేశారు. ఇప్పుడు బీసీలపై దాడులకు తెగబడుతున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షానికి చెందిన డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ను నోటీసివ్వకుండా అరెస్టు చేస్తారా?’ అని మండిపడ్డారు.

హోంమంత్రి రాజీనామా చేయాలి
అచ్చెన్నాయుడి అరెస్టుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని, హోంమంత్రి రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ‘అచ్చెన్నాయుడు ఏమయ్యారు? నాతో సహా ఆయన కుటుంబసభ్యులెవరికీ ఆయన ఫోను అందుబాటులో లేదు. ఈ ప్రభుత్వం వంద మంది పోలీసులతో చట్టవిరుద్ధంగా ఎందుకు కిడ్నాప్‌ చేయించింది? దీనికి సీఎం, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి’ అని ఆయన ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు.

కొద్ది రోజులైనా జైల్లో పెట్టాలనే: లోకేశ్‌
అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం, విజయవాడకు తరలించడం ప్రభుత్వ పెద్దల స్కెచ్‌ ప్రకారం జరిగిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. ‘ఆయన్ను ఎలాగైనా కొన్ని రోజులు జైల్లో ఉంచాలన్న ప్రభుత్వ ఉద్దేశం స్పష్టమవుతోంది. హైదరాబాద్‌లో ఉన్న లోకేష్‌.. అరెస్టు వార్త తెలిసిన వెంటనే అమరావతికి వచ్చారు.

ఇదీ చదవండి:

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్

Last Updated : Jun 13, 2020, 5:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.