రాష్ట్రంలో ఎవరికైనా నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) బిల్లులు రాకుంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నరేగా ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఆయన ప్రారంభించారు. బాధితులకు ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించేలా ఈ విభాగం కృషి చేస్తుందని చంద్రబాబు వివరించారు.
కుట్ర పూరితంగా వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన నరేగా బిల్లులపై కోర్టు మొట్టికాయలు తిన్నా బుద్ధిరాలేదని మండిపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా పలు చోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిడితో బిల్లులు నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల సమస్యలు పరిష్కారం కాని వారు 9393540999, 9676088463, 9440990479 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి