Babu review on group politics: మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై తెదేపా అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వరుస సమావేశాలకు నిర్ణయం తీసుకున్నారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే సమీక్షలు ప్రారంభించిన చంద్రబాబు.. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీదా రవిచంద్రతో భేటీ అయ్యారు. పార్టీ నేతల పనితీరుపై చంద్రబాబుకు బీదా నివేదికను సమర్పించారు.
నెలలో 15 రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత నేతల పనితీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రవిచంద్రను ఆదేశించారు. పార్టీకి ఇబ్బంది కలిగించే నేతల జాబితా సిద్ధం చేయాలన్నారు. నెల రోజుల్లో నేతల మధ్య విభేదాలు, గ్రూపు రాజకీయాలకు తెరపడాలన్నారు. మార్పు రాని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు. మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతోనూ చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారులో భాగంగా చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇవీ చూడండి