రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రైతుకు సమయానికి విత్తనాలు, ఎరువులు ఇవ్వలేదని.. పంట బీమా ప్రీమియం కట్టకపోగా తుపానొస్తే కనీసం పంటనష్టం అంచనా వేసే దిక్కుకూడా లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో వీటిపై నిలదీస్తే సస్పెండ్ చేశారని తెదేపా అధినేత ధ్వజమెత్తారు. నివర్ తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన వివిధ ప్రాంతాల రైతుల ఆవేదనకు సంబంధించిన వీడియోను చంద్రబాబు ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలపై రైతు సంఘాలకు కేంద్రం లేఖ