ETV Bharat / city

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే.. అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు: చంద్రబాబు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

CBN ON AYYANNA ISSUE: చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశంలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా.. జగన్ రెడ్డి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

CBN ON AYYANA ISSUE
CBN ON AYYANA ISSUE
author img

By

Published : Jun 19, 2022, 12:40 PM IST

Updated : Jun 20, 2022, 8:59 AM IST

CBN ON AYYANNA ISSUE: అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత.. ముమ్మాటికీ కక్ష సాధింపేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశంలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా.. జగన్ రెడ్డి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని.. చంద్రబాబు మండిపడ్డారు. అయ్యన్న ప్రశ్నల్లో.. ఏ ఒక్కదానికీ జగన్ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరని చంద్రబాబు ఆక్షేపించారు. అందువల్లే కూల్చివేతలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

  • మా సీనియ‌ర్ నేత‌, మాజీమంత్రి చింత‌కాయ‌ల‌ అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిగోడ అర్ధ‌రాత్రి జేసీబీతో కూల్చివేత‌ ముమ్మాటికీ వైసీపీ క‌క్ష సాధింపే. టిడిపిలో బ‌ల‌మైన బీసీ నేత‌ల‌ని ల‌క్ష్యంగా చేసుకుని అక్ర‌మ కేసులు, అరెస్టులు, దాడుల‌కి @ysjagan పాల్ప‌డుతున్నారు.(1/3) pic.twitter.com/9NBNN4RTHi

    — N Chandrababu Naidu (@ncbn) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలేం జరిగింది: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని.. మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ.. మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు.

ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు.. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆర్డీవో మణికంఠ.. అయ్యన్నపాత్రుడి ఇంట్లో పరిస్థితిని సమీక్షించారు.

అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టుపక్కల విద్యుత్‌ సరఫరా నిలిచింది. అర్ధరాత్రి నుంచే.. విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపేశారు. అయ్యన్నపాత్రుడి వద్ద పనిచేసేవారు, నిత్యావసరాలు తీసుకొచ్చే వారిని కూడా.. పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. అలాగే.. అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లే రెండు మార్గాలనూ పోలీసులు మూసివేశారు. మీడియాను ఆ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసుల బలగాలు మోహరించారు.

అన్ని నియమాలకు లోబడే ఇంటి నిర్మాణం చేశామని.. ఇంటి గోడ ధ్వంసం చేయడంపై ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు రాజేష్‌ను పోలీసులు చుట్టుముట్టారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, అధికారులతో.. అయ్యన్న కుటుంబం వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 20, 2022, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.