దేశానికి పింగళి వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం అందరికీ గర్వకారణం అన్నారు. జాతీయ జెండా రూపొందించి.. నేటితో వందేళ్లు పూర్తయ్యాయని, యావత్ భారతదేశ సంస్కృతికి జెండా నిదర్శనమని అన్నారు.
సమానత్వం, సౌభ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వానికి జాతీయ పతాకం.. ప్రతీక అని చెప్పారు. వందేమాతరం, హోం రూల్ ఉద్యమాల్లో పింగళి వెంకయ్య స్ఫూర్తి, చూపిన చొరవ అందరికీ ఆదర్శమని కీర్తించారు. త్యాగం, శాంతి, ప్రగతి అనే మూడు ప్రతీకలను త్రివర్ణం తన సిగలో అలంకరించుకుందని, అశోక చక్రం ధర్మానికి సూచికగా నిలిచిందని వివరించారు.
ఇదీ చదవండి: