ETV Bharat / city

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధానికి చంద్రబాబు లేఖ

author img

By

Published : Feb 20, 2021, 9:40 PM IST

Updated : Feb 21, 2021, 2:55 AM IST

విశాఖ ఉక్కు విషయంలో ప్రజల మనోభావాలు గుర్తించాలని.. ప్రధాని మోదీని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిపేయాలని కోరుతూ లేఖ రాశారు. సంస్థను లాభదాయకంగా మార్చే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధీనంలోని గనులు కేటాయిస్తే.. సమస్య పరిష్కారమవుతుందన్నారు.

Chandrababu naidu wrote a letter to Prime Minister narendra modhi on the issue of privatization of Visakhapatnam Steel Plant
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధానికి చంద్రబాబు లేఖ

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని.. ప్రధాని మోదీని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. ప్రధానికి 3 పేజీల లేఖ రాసిన చంద్రబాబు.. కర్మగారం చరిత్ర, ప్లాంటుతో ప్రజల అనుబంధాన్ని వివరించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సంస్థ పరిరక్షణపై దృష్టి పెట్టాలని ప్రధానిని కోరారు. విశాఖ నగరం, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు. దేశంలో సముద్రతీరంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారంగా అనేక ప్రత్యేకతలు సంతరించుకుందన్నారు. 1966 నుంచి తెలుగు ప్రజల విరామం లేని పోరాట ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమ అని గుర్తు చేశారు.

16 వేల కుటుంబాలు భూములిచ్చాయి

నాటి ఉద్యమంలో అమృతరావు నేతృత్వంలో విద్యార్థి లోకం అంతా ఏకమైన విషయాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. 32 మంది ప్రాణత్యాగాలు చేయగా పెద్దసంఖ్యలో ప్రజా ప్రతినిధులు పదవులు వదిలిపెట్టారన్నారు. 16 వేల కుటుంబాలు భూములు త్యాగం చేస్తే.. ఇంటికో ఉద్యోగం వాగ్దానం 8 వేల కుటుంబాలకే పరిమితమైందన్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు చిహ్నంగా విశాఖ ఉక్కు నిలిచిందని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్రానికే గర్వకారణం

1991 – 2000 మధ్య విశాఖ ఉక్కు 4 వేల కోట్ల మేర నష్టాలు చవిచూడగా వాజ్‌పేయి నేతృత్వంలోని నాటి కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని లేఖలో తెదేపా అధినేత ప్రస్తావించారు. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో 13 వందల 33 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీతో ప్లాంట్‌ను లాభదాయకంగా మార్చేందుకు సాయపడిందన్నారు. మోదీ ప్రభుత్వం గుర్తించినట్లుగా ఉక్కు ఒక వ్యూహాత్మక రంగమన్న చంద్రబాబు గనులు లేకపోవడం, రుణాలపై అధిక వడ్డీ కారణాల వల్లే విశాఖ ఉక్కు నష్టాల బాట పట్టిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధీనంలోని గనులు కేటాయిస్తే ఇబ్బందులు పరిష్కారమవుతాయన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం, స్టీల్ ప్లాంట్ భూమి 2 లక్షల కోట్ల విలువ చేస్తుందన్న చంద్రబాబు ఉత్తరాంద్ర జీవన రేఖగా రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ప్రజల మనోభావాలు, భావోద్వేగాలతో ముడిపడిన అంశాన్ని గుర్తించి రక్షించాలని ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

విశాఖ ఉక్కును కాపాడాలని సీఎం జగన్​కు విశ్రాంత ఐఏఎస్ శర్మ లేఖ

Last Updated : Feb 21, 2021, 2:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.