రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ(chandrababu naidu letter to sec and dgp over kuppam elections) రాశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో స్థానికేతరులు బోగస్ ఓట్లు వేసేందుకు వచ్చి అసలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ చర్యను అడ్డుకుంటున్న తెదేపా శ్రేణులను పోలీసులు వేధిస్తున్నారని తెలిపారు. కుప్పం మున్సిపాలిటీకి రేపు జరగబోయే ఎన్నిల్లో అనైతికంగా గెలిచేందుకు అధికార వైకాపా అడ్డదారులు తొక్కుతోందని అన్నారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక తరహాలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించేందుకు కుట్ర పన్నిందని లేఖ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు సరైన రీతిలో వ్యవహరించకపోవడం వల్ల అక్కడ అరాచకం రాజ్యమేలుతోందని.. కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. స్థానికేతరులను బయటకు పంపించి పారదర్శకంగా ఎన్నికలు జరిపించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Municipal Elections: దొంగ ఓటర్లను అడ్డుకుంటే అరెస్టులు చేసి వేధిస్తారా ?: చంద్రబాబు