ETV Bharat / city

chandrababu naidu: 'పారదర్శకంగా ఎన్నికలు జరిగితే..తెదేపాకే విజయం దక్కేది' - Chandrababu latest updates

chandrababu naidu: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల హక్కులను కాలరాస్తూ... వాటికి ఆర్థిక సంఘాలు ఇచ్చిన నిధులను లాక్కోవడం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్రం తప్పుబట్టడం, పంచాయతీలు సొంతంగా ఖాతాలు తెరుచుకుంటేనే నిధులిస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి జగన్‌ను చెంపదెబ్బ కొట్టినట్లయిందన్నారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు
author img

By

Published : Dec 2, 2021, 10:39 PM IST

Updated : Dec 3, 2021, 3:56 AM IST

chandrababu naidu: తెదేపా హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులు, దోపిడీలు, నిత్యావసర ధరల పెరుగుదలలో నెం.1 స్థానంలో ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన దాచేపల్లి, గురజాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఓటీఎస్‌ డబ్బులు ఎవరూ కట్టొద్దని, తెదేపా అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచితంగా పట్టాలిస్తామని చెప్పారు. ‘‘పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే ఒకరు... రైతులకు కనీసం వసతి కూడా లేకుండా చేశారు. వాళ్లు రోడ్లపై భోజనం చేయాల్సిన పరిస్థితి కల్పించారు. ఆడబిడ్డల్ని అవమానించినందుకు సిగ్గుగా లేదా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘

పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభిస్తారు?...

2021లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రులు.... ప్రాజెక్టు పూర్తి చేసారా? అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభిస్తారని నిలదీశారు. వైకాపా నాయకులు పోలవరం ప్రారంభిస్తే తాను వచ్చి చూస్తానని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా గురజాలలో చనిపోయిన ఎనిమిది మంది కార్యకర్తలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్వారీలో పడి చనిపోయిన పిల్లల కుటుంబాలకు 50 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఓటీఎస్‌ పథకంలో ఎవ్వరూ డబ్బులు చెల్లించవద్దని... తాను అధికారంలోని వచ్చాక నెలలో ఇళ్ల పట్టాలు ఉచితంగా ఇస్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వరి సాగు వద్దని చెప్పిన మంత్రి గంజాయి సాగు చెయిస్తారా అని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పై జగన్ వైఖరి పై మండిపడ్డారు. రాజధానులపై రోజుకో ఆలోచన చేస్తూ సీఎం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా?

chandrababu naidu: ‘‘వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో గురజాల నియోజకవర్గంలో ఎనిమిది మంది తెదేపా కార్యకర్తల్ని హతమార్చారు. వైకాపా నేతలు అక్రమంగా తవ్వేసిన క్వారీల గుంతల్లో పడి ఏడుగురు చిన్నారులు చనిపోయారు. అధికారం ఉందని మనుషుల్ని చంపుతారా? ముఖ్యమంత్రి జగన్‌కు మానవత్వం ఉందా? ఆయన మనిషైతే హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తారా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘తురకపాలెంలో 75 ఏళ్ల షేక్‌మూల్‌సాబ్‌, 68 ఏళ్ల షేక్‌చాంద్‌బీ దంపతులపై హత్యాయత్నం కేసు పెట్టారంటేనే వైకాపా నాయకులు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగి ఉంటే గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీల్లో గెలిచేవాళ్లం. వైకాపా నాయకుల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడి శావల్యాపురం జెడ్పీటీసీగా గెలిచిన హైమావతికి అభినందనలు...’’ అని ఆయన పేర్కొన్నారు.

గురజాల నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థుల దాడుల్లో చనిపోయిన 8 మంది తెదేపా కార్యకర్తల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, వైకాపా నేతల దాడిలో గాయపడ్డ సైదాకు రూ.లక్ష, క్వారీ గుంతల్లో పని చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున పార్టీ తరపున చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాల్ని వేదికపైకి రప్పించి, వారందరికీ ఆయన ధైర్యం చెప్పారు. వైకాపా నాయకులకూ శిశుపాలుడి గతే పడుతుందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు ఉండకూడదా? ఈ రాష్ట్రమేమైనా మీ జాగీరా?అని ఆయన ప్రశ్నించారు. దాచేపల్లికి చెందిన ఎస్సీ వర్గానికి చెందిన వైద్యురాలు వరలక్ష్మి తెదేపాలో చేరారు. గత ఎన్నికల్లో తాను దాచేపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపా తరపున పోటీకి సిద్ధపడితే... వైకాపా నాయకులు తన ఆస్పత్రిపై దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Akhanda review: 'అఖండ' సినిమా.. ఆడియెన్స్​ రియాక్షన్​ ఇదే!

Last Updated : Dec 3, 2021, 3:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.