రాజభవన్‌లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్‌ను భువనేశ్వర్ విమానాశ్రయంలో తొలిసారి కలిశానన్న గవర్నర్... ఆయన ఎంతో ఆకర్షణ కలిగిన మనిషి, మహానాయకుడని కొనియాడారు. గతంలో విజయవాడ పర్యటించిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. బిజూపట్నాయక్‌తో తన అనుబంధాన్ని చంద్రబాబు గవర్నర్‌తో పంచుకున్నారు. తమతమ రాజకీయ అనుభవాన్ని బిశ్వభూషణ్, చంద్రబాబు పరస్పరం పంచుకున్నారు.
గవర్నర్‌తో చంద్రబాబు సమావేశం మర్యాదపూర్వకమనే తెదేపా వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు వెంట కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, మాణిక్య వరప్రసాద్, రామానాయుడు ఉన్నారు. గవర్నర్‌తో దాదాపు 40నిమిషాలపాటు చంద్రబాబు భేటీ అయ్యారు.
ఇదీ చదవండీ...