ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులుు, విమర్శకులనూ మెప్పించారన్నారు. ఆయన 90వ ఏట అడుపెడుతుండడం తనకు సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధరణ అయి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని విన్నానన్న చంద్రబాబు.. ఆరోగ్యం జాగ్రత్త అని సూచించారు. నిండు నూరేళ్లు అదే ఉల్లాసం, ఉత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
పుష్పక విమానం, ఆదిత్య 369 వంటి ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను తీసిన వెండితెర సైంటిస్ట్ సింగీతం శ్రీనివాసరావు 90 ఏళ్ళ వయసులోనూ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి పని చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని లోకేశ్ గుర్తు చేశారు. తాను కూడా ఆ చిత్రం కోసం అభిమానులతో కలిసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. ఈనాటి దర్శకులు సింగీతం శ్రీనివాసరావును స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి...