గుర్రం జాషువా జయంత్రి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు ఆ మహనీయుని సేవలు స్మరించుకున్నారు. మనుషులంతా ఒక్కటే అన్న విశాల దృక్పథం లేకపోతే కళలు బతకవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజంలో ఆనాడు పేరుకుపోయిన కులతత్వాన్ని తన రచనా శక్తితో ఎదుర్కొన్న కవిసేనాని, దళిత తేజోమూర్తి గుర్రం జాషువా అని తెలిపారు. జాషువా జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్ఫూర్తిని అందుకుందామని, దళితజనోద్ధరణకు నడుం కడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
నిర్భయంగా, బలంగా, సూటిగా కులవివక్షపై తన అక్షరాయుధాన్ని ప్రయోగించి తెలుగు దళిత కవిత్వానికి 'ఆదికవి' అనిపించుకున్న గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుందామని నారా లోకేశ్ అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జాషువా స్పూర్తితో పోరాడుదామని లోకేశ్ పిలుపునిచ్చారు.
అలాగే భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆ వీరునికి నివాళులు అర్పించారు. నాటి జాతీయోద్యమానికి స్ఫూర్తి కలిగించిన భగత్ సింగ్ పోరాటం... నేటికీ ప్రజావిప్లవాలకు ఆదర్శంగా నిలుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. అణచివేతను, దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంలో నేటి యువత భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి..