కడప జిల్లాలో హత్యాచారానికి గురైన ఎస్సీ మహిళకు న్యాయం జరగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా హత్యాచారానికి కారకులైన దోషులను రక్షించాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే ఎఫ్.ఐ.ఆర్లో గుర్తుతెలియని వ్యక్తులు అని నమోదు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ తరహా వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్న చంద్రబాబు.., అధికార పార్టీ అండతో ఎస్సీలు, ఆదివాసులు, మైనార్టీ మహిళలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న చంద్రబాబు.. సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన