ETV Bharat / city

Chandrababu: రోడ్డుపైన గుంతలనే పూడ్చలేని ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తారా..?: చంద్రబాబు - వైకాపాపై చంద్రబాబు మండిపాటు

Chandrababu fires on YSRCP: తెదేపా నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న వైకాపా ప్రభుత్వం.. తగిన మూల్యం చెల్లించుకుంటుందని చంద్రబాబు హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన.. ఇష్టారాజ్యంగా పన్నులు పెంచేసిన ముఖ్యమంత్రిపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. రోడ్డుపైన గుంతలనే పూడ్చలేని ముఖ్యమంత్రి.. ఇంక అభివృద్ధి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను వైకాపా నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు.

Chandrababu fires on ysrcp in vizianagaram tour
చంద్రబాబు
author img

By

Published : Jun 17, 2022, 7:56 PM IST

విజయనగరంలో చంద్రబాబు పర్యటన

Chandrababu fires on YSRCP: వైకాపా ఆరాచకాలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగుదేశం కార్యకర్తలకు పార్టీ అధినేతగా అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని.. చంద్రబాబు స్పష్టంచేశారు. ఎవరూ భయపడొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. తెలుగుదేశం వారంటూ సంక్షేమ పథకాలను ఆపేస్తే ఊరుకోబోమన్న ఆయన.. కోర్టులకు వెళ్లైనా సరే న్యాయం చేయిస్తానని చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశం అధినేతకు.. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

జిల్లాలోని దాసన్నపేట రోడ్ షోలో మాట్లాడిన ఆయన.. వైకాపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి పేదలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ సీఎంగా ఉన్నంతకాలం ఎవరికీ ఉద్యోగాలు, పెట్టుబడులు రావని.. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రా.. నినాదంతోనే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. రోడ్డుపైన గుంతలనే పూడ్చలేని ముఖ్యమంత్రి.. ఇంక అభివృద్ధి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు.

తెదేపా నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న వైకాపా ప్రభుత్వం.. తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. సారా వ్యాపారం మాత్రమే తెలిసిన బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలిచ్చారని ధ్వజమెత్తారు. నిజాయతీపరుడైన అశోక్ గజపతిని ఈ ప్రభుత్వం వేధింపులకు గురిచేసి, ఎన్నో కేసులు పెట్టినా.. అవన్నీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారని చంద్రబాబు అన్నారు.

నాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు.. రాష్ట్రం కోసమే నా బాధ. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడతామా. మేం టిడ్కో ఇళ్లు కట్టాం.. లబ్ధిదారులకు ఇచ్చావా జగన్‌..? తెదేపా కార్యకర్తలకు స్థలాలు, ఇళ్లు ఇవ్వడం లేదు. ఇళ్లు కట్టుకున్న వారికి బిల్లులు ఇవ్వడం లేదు. -చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.