Chandrababu fires on CM Jagan: తన పంతమే ఫైనల్ కాదని, న్యాయవ్యవస్థ అనేది ఒకటి ఉందనే విషయాన్ని జగన్ రెడ్డి గుర్తించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హితవు పలికారు. వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను.. జగన్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. న్యాయబద్ధంగా జరిగిన ఏ ఎన్నిక ఫలితాన్ని అంగీకరించేందుకు సీఎం సిద్ధంగా లేరనే విషయం.. కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికతో రుజువైందన్నారు. ఇప్పటికైనా చట్టాలు, నిబంధనలకు లోబడి పని చేయడం జగన్ నేర్చుకోవాలని సూచించారు.
కొవ్వూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును చంద్రబాబు స్వాగతించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికను రద్దు చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన జగన్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదని విమర్శించారు. బ్యాంక్ పాలక వర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.
-
బ్యాంక్ పాలక వర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్ట్ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను సైతం జగన్ భ్రష్టుపట్టించారు.(2/3)
— N Chandrababu Naidu (@ncbn) August 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">బ్యాంక్ పాలక వర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్ట్ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను సైతం జగన్ భ్రష్టుపట్టించారు.(2/3)
— N Chandrababu Naidu (@ncbn) August 30, 2022బ్యాంక్ పాలక వర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్ట్ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను సైతం జగన్ భ్రష్టుపట్టించారు.(2/3)
— N Chandrababu Naidu (@ncbn) August 30, 2022
ఇవీ చదవండి: