ETV Bharat / city

రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేయాలి: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

వైకాపా ప్రభుత్వం అన్నదాతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ...రైతుకు వ్యతిరేకంగా పని చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవోలను భోగిమంటల్లో వేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గత ఏడాదిన్నరలో 17 వందల 79మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో వేయాలి

author img

By

Published : Jan 12, 2021, 3:25 PM IST

Updated : Jan 13, 2021, 5:55 AM IST

వైకాపా ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో వేసి తగులబెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు, సున్నా వడ్డీని కుదించడం, ప్రకృతి సేద్యం నిధుల్ని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలకు కేటాయించడం, కులాలవారీగా రైతుల్లో విభజన తేవడం వంటి జీవోల్ని భోగి మంటల్లో దహనం చేయాలని సూచించారు. తెదేపా జోనల్‌ ఇన్‌ఛార్జులు, లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలు, శాసనసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో చంద్రబాబు మంగళవారం వీడియో సమావేశం నిర్వహించారు. ‘రైతుల కన్నీళ్లకు ఈ సంక్రాంతి చరమగీతం పాడాలి. రైతులు, రైతు కూలీలకు తెదేపా అండగా ఉండాలి. వైకాపా రైతు వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటించాలి. జగన్‌రెడ్డి మోసకారి, నేరచరిత్ర ఉన్న వ్యక్తి, నమ్మకద్రోహి. 140 దేవాలయాల్లో దాడులు, విధ్వంసం జరిగితే చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌రెడ్డి ముఖ్యమంత్రయ్యాక మత విద్వేషాల్ని రెచ్చగొట్టడం, అన్యమత ప్రచారాలు, బలవంతపు మతమార్పిళ్లు, దాడులు, విధ్వంసాలతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేశారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. జగన్‌ రైతు ద్రోహిగా మారారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలవల్లే ఏడాదిన్నరలో 1,779 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. వరుస విపత్తుల్లో రైతులు పూర్తిగా నష్టపోయారు. బీమా అందక, పెట్టుబడి రాయితీ రాక ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.2,700 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. తడిచి, రంగు మారిన ధాన్యాన్ని కొనేవాళ్లు లేరు. కర్నూలులో టమాటాకు ధరలేక రైతులు రోడ్లపై పారబోశారు. అరటికి ధర లేక తోటల్ని దున్నేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన 30 వేల మంది రైతు కుటుంబాల్ని రోడ్డుకీడ్చారు. తెదేపా హయాంలో పేదలకు ఇచ్చిన సంక్రాంతి కానుకనూ ఈ ప్రభుత్వం రద్దు చేసింది’ అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైకాపా నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల్లో వైకాపా ఓటమే లక్ష్యం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనవరి 18న ఎన్టీఆర్‌ వర్ధంతిని గ్రామగ్రామాన జరపాలని, ‘లెజండరీ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌’ విజయవంతం చేయాలని సూచించారు.

సమాజాభివృద్ధికి యువతే పునాది
సమాజాభివృద్ధికి పునాది యువతరమేనని చంద్రబాబు పేర్కొన్నారు. హింసా విధ్వంసాలు, కక్ష సాధింపు చర్యలు లేని సమాజాన్ని ఆవిష్కరించడమే యువత లక్ష్యం కావాలని సూచించారు. ‘జాతీయ యువజన దినోత్సవం’ సందర్భంగా మంగళవారం ఆయన యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెదేపా ప్రభుత్వ హయాంలో యువతలో నైపుణ్యాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యమిచ్చాం. 13 జిల్లాల ఏపీలో ఐదేళ్లలో దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాం. పది లక్షల ఉద్యోగాలు కల్పించాం. 19 నెలలుగా ఏపీ భవిష్యత్తు అంధకారమైంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారు. తెదేపా తెచ్చిన పెట్టుబడులను ఆపేశారు. సంస్థలను తరిమేసి యువత ఉపాధికి గండికొట్టారు. ఎందరో యువకులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు. పాలకుల దుశ్చర్యలపై ప్రజలను చైతన్యపరిచి, రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలి’ అని సూచించారు.

పరిటాలలో భోగి సంబరాలకు చంద్రబాబు

కంచికచర్ల, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో బుధవారం నిర్వహించనున్న భోగి సంబరాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొంటారని పార్టీ నాయకులు తెలిపారు. తెల్లవారుజామున 4.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

ఇదీచదవండి: ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే దేవాలయాలపై దాడులు: తెదేపా

Last Updated : Jan 13, 2021, 5:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.