పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. దుస్థితికి గలకారణాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. సుమారు 250కి పైగా పిల్లలు, పెద్దలు అస్వస్థతకు గురయ్యారని.. వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజలకు రక్షిత తాగునీరు అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత జలాలు తాగి ప్రజలు అస్వస్థతకు గురైతే వారి ఆరోగ్య సంరక్షణ గురించి పట్టించుకునే తీరికలేని ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని చేతకాని పాలన కొనసాగుతోందని.. ఇందుకు సీఎం జగన్ సిగ్గుపడాలని చంద్రబాబు మండిపడ్డారు.
ఇదీ చూడండి: